Sunday, December 29, 2024

బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జులతో నడ్డా భేటీ

- Advertisement -
- Advertisement -

JP Nadda meets with BJP state in-charges

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మంగళవారం పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జులతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలతోపాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఇన్‌చార్జులతో నడ్డా సమావేశం కావడం ఇదే మొదటిసారని వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నడ్డాతోపాటు బిజెపి ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) సంతోష్ పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడం, 2024 సారత్రిక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడానికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరిగినట్లు వర్గాలు వివరించాయి. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, త్రిపుర మాజీ సిఎం బిప్లబ్ కుమార్ దేబ్, బిజెపి ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల పార్టీ బీహార్ ఇన్‌చార్జిగా తావ్డే, పంజాబ్‌కు రూపాని, హర్యానాకు దేబ్‌ను బిజెపి నియమించింది. బిజెపి ఎంపి హరీష్ ద్వివేది బీహార్ సహ ఇన్‌చార్జిగా కొనసాగుతారని వర్గాలు తెలిపాయి. బిజెపి ప్రాంతీయ ఇన్‌చార్జిగా బన్సల్ వ్యవహరిస్తారని, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిషలో బిజెపి కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారని వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News