Tuesday, January 21, 2025

నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ఈ నెల 25న బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బిజెపి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ముఖ్యఅతిథిగా హాజరవుతారని, కావున లక్ష మందికి తగ్గకుండా ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభలో పాల్గొనాలని ఆయన కోరారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు పొత్తుల పార్టీలని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని జోష్యం చెప్పారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ అవినీతి పాలన చేస్తున్నారని చెప్పిన ఏ ఒక్క హామీని సక్రమంగా నిర్వహించలేదని, తెలంగాణ ప్రజలు చీకొడుతున్నందుకే టిఆర్‌ఎస్‌కు బదులు బిఆర్‌ఎస్ అని పార్టీ పెట్టారని అన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీ తరపున నిలబడ్డ ప్రతి ఒక్క అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండ మన్నెమ్మ నగేష్ దంపతులు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, అసెంబ్లీ ఇంచార్జి దిలీపా చారి, జిల్లా ఇంచార్జి కొల్లు మాధవి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News