Monday, December 23, 2024

తమిళనాడు కల్తీసారా ఘటనపై ఎందుకీ మౌనం?: ఖర్గేను ప్రశ్నించిన నడ్డా

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రజల మరణాలకు దారితీసిన కల్తీసారా దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నిస్తూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. తమిళనాడు కల్తీసారా దుర్ఘటన పూర్తిగా మానవ తప్పిదం వల్ల జరిగిన విషాదమని ఖర్గేకు రాసిన లేఖలో నడ్డా పేర్కొన్నారు. డిఎంకె సారథ్యంలోని అధికార ఇండియా కూటమికి, కల్తీసారా మాఫియాకు మధ్య బలమైన సంబంధాలు లేకుండా ఉండి ఉంటే 56 మంది ప్రాణాలు కాపాడి ఉండవచ్చని నడ్డా తెలిపారు.

తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన అత్యంత ఘోరమైన కల్తీసారా దుర్ఘటన అనంతరం కల్లకురిచిలోని కరుణపురం గ్రామంలో ఎగసిపడుతున్న చిత మంటలకు సంబంధించిన చిత్రాలను చూసి యావద్దేశ ఆత్మసాక్షి క్షోభించిందని నడ్డా పేర్కొన్నారు. షెడ్యూల్డు కులాల జనాభా అధికంగా ఉన్న కరుణపురం పేదరికం, వివక్ష కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇంతటి ఘోర విపత్తు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస పార్టీ మౌన ముద్ర దాల్చడం తనను దిగ్భాతికి గురిచేస్తోందని ఆయన ఖర్డేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన కల్తీసారా దుర్ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా 159 మంది ఆగసుపత్రి పాలయ్యారు. కొన్ని అంశాల విషయంలో తాము పార్టీలకతీతంగా వ్యవహరించాలని, ఎస్‌సి, ఎస్‌టి వర్గాల భద్రత, సంక్షేమం కూడా అందులో ఒకటని ఆయన అన్నారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించేలా తమిళనాడులోని డిఎంకె సారథ్యంలోని ఇండియా కూటమి ప్రభుత్వంఐ ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుసామిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఖర్గేను నడ్డా కోరారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కూడా పెంచి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News