Friday, December 27, 2024

బిజెపిని గెలిపిస్తే మరింత అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో తొలిసారి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన పార్టీ తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలకు ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ.. దేశంలో కుటుంబ పాలన లేకుండా చేయాలని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని, ఇలాంటి పార్టీలను అడ్రస్సు లేకుండా చేయాలని పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ఉన్నాయన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, బీహార్‌లో లాలు ప్రసాద్ యాదవ్, ఏపీలో వైఎఎస్సార్, ఆ తర్వాత జగన్ కుటుంబం, తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఉందన్నారు. తెలంగాణలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందన్నారు.ఈ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం రూ.5 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఉజ్వల వినియోగదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. నరేంద్రమోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. బీజేపీని గెలిపిస్తే వరికి మద్దతు ధరను రూ.3100కు పెంచుతామన్నారు. ఎరువుల కోసం రూ.2100 ఇన్‌పుట్ సబ్సిడీని అందిస్తామన్నారు. మహిళా సంఘాలకు ఒక శాతం వడ్డీకే రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News