Friday, January 10, 2025

తెలంగాణకు జెపి నడ్డా.. నాగర్ కర్నూల్ లో బిజెపి భారీ బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జెపి నడ్డా ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా నోవాటెల్ చేరుకోనున్నారు.

అక్కడి నుండి సంపర్క్ సే సమర్థన్‌లో భాగంగా టోలిచౌక్ లోని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్ లోని పద్మశ్రీ ఆనంద శంకర్ జయంతిల నివాసాలకు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ చేరుకోనున్నారు. అక్కడి జడ్పీ హైస్కూలు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Also Read: రేపు మహారాష్ట్ర పర్యటనకు సిఎం కెసిఆర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News