Saturday, January 11, 2025

సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్‌ను సందర్శించిన జెపి నడ్డా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఢిల్లీ లోని సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్ చర్చిని సందర్శించి మానవ జాతికి జీసస్ క్రీస్తు ఒక స్ఫూర్తి ప్రదాత అని ప్రస్తుతించారు. క్రైస్తవులతో బీజేపీ మమేకం కావడంలో భాగంగా అనేక మంది సీనియర్ క్రైస్తవ మత బోధకులను కలుసుకుని అభినందనలు తెలిపారు. ప్రపంచ శాంతికి, సుహృద్భావానికి క్రీస్తు తన జీవితాన్ని అర్పించారని కొనియాడారు. క్రైస్తవులు అత్యధికంగా ఉన్న కేరళ, వంటి రాష్ట్రాల్లో క్రైస్తవ మత పెద్దలతో మమేకం కావడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News