Sunday, December 22, 2024

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా సతీమణి కారును కొట్టేశారు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సతీమణి కారును కొట్టేశారు కొందరు దుండగలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 19న ఢిల్లీ నగరంలోని గోవిందపురి ప్రాంతంలో జెపి నడ్డా సతీమణి టయోటా ఫార్చునర్‌ కారును అపహరించినట్లు తెలుస్తోంది.

కారును సర్వీసింగ్ చేయించి తీసుకువస్తుండగా.. మధ్యలో తన ఇంటి వద్ద కారును ఆపి.. భోజనం చేసి వచ్చేసరికి కారు కనిపించకుండా పోయినట్లు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కారు డ్రైవర్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కారు ఆచూకీ ఇప్పటివరకూ లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News