- Advertisement -
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బిజెపి) అధ్యక్షుడు జెపి. నడ్డా పదవీ కాలంను 2024 జూన్ వరకు పొడగించారు. బిజెపి జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశంలో మంగళవారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకోవడం జరిగిందన్నారు. ‘దేశంలోని రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న పార్టీ బిజెపి. పార్టీ రాజ్యాంగం ప్రకారం మేము బూత్ స్థాయి నుంచి అధ్యక్ష పదవి వరకు ఎన్నికలు నిర్వహిస్తాము’ అన్నారు.
అమిత్ షా కేంద్ర హోం మంత్రిగా నియుక్తులయ్యాక 2019లో నడ్డాను పార్టీ ప్రెసిడెంట్‌ను చేశారు. మొదట్లో ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. తర్వాత ఆయనకు మూడేళ్ల పదవీ కాలాన్ని ఇచ్చారు. ఆయన పదవీ కాలంలో బిజెపి బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో బాగా పనిచేసిందని అమిత్ షా తెలిపారు.
- Advertisement -