Sunday, January 19, 2025

మా ఫేస్ వాల్యూతో ఒక్క ఓటు కూడా రాదు: జెసి ప్రభాకర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: పాదయాత్రలో టిడిపి యువనేత లోకేష్ సక్సెస్ అవుతున్నారని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జెపి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోకేష్ వెంట మాతో పాటు ప్రజలు కూడా నడుస్తున్నారని, భువనేశ్వరి దిగులుపడొద్దని, ప్రజల కోసం లోకేష్ యుద్ధం చేస్తున్నారని ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివెంజ్ అనొద్దని, వాళ్లను క్షమిద్ధామని, కొందరు అధికారులను మాత్రం విడిచి పెట్టొద్దని సూచించారు. మంచి పనులు చేయడం వల్లే చంద్రబాబు ప్రజల మనిషి అయ్యారని జెసి ప్రశంసించారు. మా ఫేస్ వాల్యూతో ఒక్క ఓటు కూడా రాదని, చంద్రబాబు ఫేస్ వాల్యూ, జగన్ చేస్తున్న తప్పులే మమ్మల్ని గెలిపిస్తాయని, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు సిఎం కావాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News