Monday, December 23, 2024

జెపిఎల్ విజేత టివి9

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: వారం రోజులు సందడిగా సాగిన కెఎస్‌జి జర్నలిస్టు టి20 ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) శనివారం ముగిసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన తుది పోరులో టివి9 ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎన్‌టివితో జరిగిన ఫైనల్లో టివి9 12 పరుగుల తేడా విజయం సాధించింది. దీంతో జెసిఎల్ సీజన్-1 చాంపియన్‌గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు ఎన్‌టివి ఆటగాడు కిరణ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు టివి9 ఆటగాడు జగదీష్‌లు దక్కించుకున్నారు. అనంరతం హెచ్‌సిఎ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ కలిసి విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు.

దివ్యాంగ క్రీడాకారులకు చేయూత

అదేవిధంగా స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ తెలంగాణ (ఎస్జాట్) తరఫున పది మంది దివ్యాంగ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో త్రుక్ష ఫుడ్స్ ఎండి భరత్ రెడ్డి, కెఎస్‌జి సిఇఒ సంజయ్, లైఫ్ స్పాన్ స్పోర్ట్స్ హెడ్ భరణి, స్మయిల్‌గార్డ్ ఫౌండర్ శరత్, జూపర్ ఎల్‌ఇడి సిఇఒ ఒరుసు రమేష్, మెడికవర్ తెలంగాణ హెడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News