Sunday, December 22, 2024

చర్చలు సఫలం.. సమ్మె విరమణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు జూనియర్ పంచాయతీ సెక్రటరీల సంఘం వెల్లడించింది. శనివారం రాత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో వారు సమావేశమై తమ సమస్యలపై చర్చలు జరిపారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని. ఇతర డిమాండ్ లను ప్రస్తావించారు. ఇందుకు మంత్రి సానుకూల స్పందించారు. దీంతో సమ్మె విరమణకు జూనియర్ కార్యదర్శులు ఒప్పుకున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విధుల్లో చేరాలని ఆదేశించింది. ఇందుకు శనివారం మధ్యాహ్నం వరకు గడువు విధించడంతో జూనియర్ కార్యదర్శులు పెద్ద ఎత్తున తమ విధులకు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, కోశాధికారి శశిధర్ గౌడ్ లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News