Tuesday, December 24, 2024

జూడాల సమ్మె విరమణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం జూనియర్ డా క్టర్లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యా లు,స్టైపెండ్ బకాయిలు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో జూ డాలు గురువారం నుంచి విధులకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జూడాల తో కలిసి మంత్రి మీడియా సమావేశం ని ర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, జూనియర్ డాక్టర్లు గతంలో రెండు సార్లు స్టైపెండ్‌ల విడుదల గురించి తమ దృష్టికి తెచ్చారని, చాలా ఏ ళ్లుగా సమస్యలు ఉన్నాయని చెప్పారు. గ్రీ న్ ఛానెల్ ద్వారా స్టైపెoడ్, వసతి భవనా లు ఏర్పాటు చేయాలని కోరారని అన్నా రు. వైద్యులకు రక్షణ కావాలని కోరారని,

దీనిపై జరిగిన చర్చలు ఫలించాయని వెల్లడించారు. జూడాలు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వసతి గృహాలపై ఫిర్యాదు చేశారని తెలిపారు. వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారన్నారు. తమకు మరింత భద్రత కల్పించాలని జూడాలు కోరారని వివరించారు. జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన సమస్యలపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారని పేర్కొన్నారు. సిఎం ఆదేశాల మేరకు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను సందర్శించామని వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రిలో సౌకర్యాల కోసం రూ.121 కోట్లు విడుదల చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అలాగే గాంధీ ఆసుపత్రి కోసం రూ.80 కోట్లు మంజూరు చేశామన్నారు. కాకతీయ ఆసుపత్రికి సీసీ రోడ్డు మంజూరు చేశామని స్పష్టం చేశారు. వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు నిర్మించేందుకు సిద్ధం
ఉస్మానియా ఆసుపత్రి విషయం కోర్టులో ఉందని మంత్రి గుర్తు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలు నిర్మించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఉస్మానియా గురించి సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పేదలకు వారివారి ప్రాంతాల్లోనే వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యశాఖ విధానాల్లో కూడా మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. పేదల ప్రజలకు విద్య, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఆసుపత్రుల్లో మంచి భోజనం అందించాలని ఆదేశించామన్నారు. డ్రగ్స్, హెల్త్ ల్యాబ్‌లను ఆధునీకరిస్తున్నామని వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్య పెంచుతున్నామని, ఫుడ్, డ్రగ్స్ ల్యాబ్‌లని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

ప్రమాణాలతో కూడిన విద్య, మెరుగైన వైద్యం అందించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ, తమ సమస్యలను ఇంత త్వరగా పరిష్కారానికి కృషి చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు. తమ స్టైఫండ్ అంశంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చారిత్రక నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణంపై స్పష్టత రాలేదనే బాధలో తాము సమ్మె కొనసాగిచామని, కానీ మంత్రితో చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు ఉస్మానియా జూడాలు ప్రకటించారు. గత ప్రభుత్వం తొమిదిన్నర సంవత్సరాలుగా జూడాలను పట్టించుకోలేదని వాపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు జూడాలు పాలాభిషేకం చేశారు.

మూడు మెడికల్ కాలేజీలకు రూ. 204.85 కోట్లు కేటాయింపు
ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలకు రూ. 204.85 కోట్లు కేటాయించారు. ఉస్మానియా వసతి భవనాలు, రోడ్లకు రూ. 121.90 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ. 79.50 కోట్లు, కాకతీయ మెడికల్ కాలేజీలో సీసీ రోడ్లకు రూ. 2.75 కోట్లు కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News