Thursday, January 23, 2025

ఆస్కార్ వేదికపై డ్యాన్స్.. తారక్ ఏం చెప్పాడంటే..

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా గ్లోబల్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మాసివ్ హిట్ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డులో బరిలో నిలిచింది. ఈనెల 13న జరిగే ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ సినిమా అవార్డు సాధించాలని దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డుల వేదికపై ఈ పాట పాడిన సింగర్స్ లైవ్ పర్ఫామెన్స్ చేయనున్నారు.

అయితే ఇదే సమయంలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల డ్యాన్స్ పర్ఫామెన్స్ కూడా ఉంటుందా? అని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై ఓ విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తారక్ మాట్లాడుతూ “ ఇప్పుడు మాకు ఆ సాంగ్ కోసం మళ్ళీ రిహార్సల్స్ చేసే సమయం లేదు. అందుకే తాము ఆస్కార్ స్టేజ్‌పై ఎలాంటి డ్యాన్స్ చేయడం లేదు”అని చెప్పారు. ఇక ఆస్కార్ అవార్డుల వేడుక నుంచి తిరిగి వచ్చాక కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News