అమరావతి: తన అభిమాని శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన విషయమని నటుడు జూనియర్ ఎన్‌టిఆర్ సంతాపం తెలిపారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనుసును కలచి వేస్తుందన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్‌టిఆర్ వీరాభిమాని శ్యామ్ మణికట్టు వద్ద బ్లేడ్ తో కోసుకొని అనంతరం ఉరేసుకున్నాడు. బ్లేడ్ మాత్రం అతడి జేబులో దొరికింది. హత్య చేసి ఉరేశారని అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
శ్యాం సూసైడ్ చేసుకునే ముందు తన ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియోలు
దీనికి రాజకీయ రంగు పులిమి నీచ రాజకీయాలు చేస్తోంది టిడిపి. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో.. నీచ రాజకీయాలు మానుకో..@JaiTDP @ncbn @naralokesh #RIPShyamNTR #TDPFakePropaganda pic.twitter.com/usjiBqaw7g
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 27, 2023
Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ