Monday, January 20, 2025

శృతి మించిన అభిమానం…ఎన్టీఆర్ అభిమానులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అభిమానులు ఒక్కోసారి శృతి మించి వ్యవహరిస్తుంటారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు వారు వెర్రిగా వ్యవహరిస్తుంటారు. టాలీవుడ్ ప్రసిద్ధ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇలాగే వ్యవహరించి వార్తల్లోకి ఎక్కారు. వారు మేకలను బలి ఇచ్చి వాటి రక్తాన్ని జూ.ఎన్టీఆర్ బ్యానర్‌లపై జల్లారు. కర్నాటకలోని రాబర్ట్‌సన్‌పేట్‌లో వారిలాంటి బలులు ఇచ్చినందుకు తొమ్మిది మంది ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విజయవంతం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ కూడా బాగా పెరిగింది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ 40వ జన్మదినం వేడుక జరిగింది. అప్పుడే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ఫ్లెక్సీ బ్యానర్లపై అభిమానులు మేకల రక్తం జల్లడం వికృతంగా అనిపించింది. అక్రమంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పి.శివ నాగ రాజు, కె.సాయి, జి.సాయి, డి.నాగ భూషణం, వి.సాయి, పి.నాగేశ్వర రావు, వై.ధరణి, పి.శివ, బి.అనీల్ కుమార్గ్రా గుర్తించి అరెస్టు చేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ తొలి సినిమా…యశ్ రాజ్ ఫిల్మ్ వారి ‘వార్2’లో నటిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News