నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గురువారం నందమూరి తారకరామారావు 28వ వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఫ్టెక్సీల వార్ చోటుచేసుకుంది. రామారావు వర్దంతిని పురస్కరించుకుని హైదరాబాద్ డా బిఆర్ ఆంబేద్కర్ సచివాలయం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈరోజు ఉదయం బాలకృష్ణ నివాళులర్పించారు.
ఆయనతోపాటు పలువురు కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు. తర్వాత అక్కడి నుంచి బాలకృష్ణ వెళ్లగానే ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలయ్య ఆదేశాలతోనే ఆ ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ, తారక్ ను దూరం పెడుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కాగా, బాలకృష్ణ కంటే ముందే ఈరోజు తెల్లవారుజామున తారక్, కళ్యాణ్ రామ్ లు కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.