Thursday, January 23, 2025

గ్లోబల్ మార్కెట్ పై ఫోకస్

- Advertisement -
- Advertisement -

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో స్టార్ హీరో ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డుల రేసులో నిల్చింది ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇటీవల ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్ కొన్నాళ్లుగా అమెరికాలోనే మకాం వేసి అక్కడి మీడియాతో ముచ్చటిస్తున్నాడు.

అమెరికన్ మీడియా మంచి పబ్లిసిటీ కల్పించింది ఎన్టీఆర్ కి. అయితే అమెరికన్ సినీ నిర్మాణ సంస్థలు తనని సంప్రదిస్తే హాలీవుడ్ సినిమాలు చేస్తానని చెబుతున్నాడు తారక్. ఎన్టీఆర్ సీరియస్‌గానే గ్లోబల్ మార్కెట్ పై ఫోకస్ పెట్టాడట. ఒకవేళ ఏదైనా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోను అని తన సన్నిహితులకు చెబుతున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News