Sunday, January 19, 2025

తారక్‌కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో ఎన్టీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో తారక్ సభ్యత్వం సాధించారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని కొమురం భీమ్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ స్టార్ హీరో. ఇక అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్ కొత్త సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఎన్టీఆర్ పేరును అధికారికంగా ప్రకటించింది.

తారక్‌తోపాటు మరో నలుగురు హాలీవుడ్ నటులకు కూడా ఇందులో స్థానం కల్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఎన్టీఆర్‌కు అభినందనలు చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’లో చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అదేవిధంగా హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’లో కూడా తారక్ నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News