Monday, December 23, 2024

‘బింబిసార’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన ఎన్టీఆర్..

- Advertisement -
- Advertisement -

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్‌రామ్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. నూతన దర్శకుడు వశిష్ఠ్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదల ఈ మూవీ ట్రైలర్ కు  అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కాగా, ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.  ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. బింబిసారుడి విశ్వరూపాన్ని ఇందులో చూపించారు. పవర్ ఫుల్ డైలాగులు, అద్భుతమైన విజువల్స్ తో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఈ చిత్రంలో క్యాథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు.

Jr NTR Launches ‘Bimbisara’ Release Trailer

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News