Monday, January 20, 2025

‘వార్ 2’ కోసం ఎన్టీఆర్ మాస్ లుక్..

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ చిత్రం ‘దేవర’తో తాను కోరుకున్న భారీ సక్సెస్‌ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా సక్సెస్‌తో తారక్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అయితే ఈ సినిమా అనంతరం అతను తన దృష్టిని బాలీవుడ్ భారీ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2పై పెట్టాడు. ఈ నేపథ్యంలో తారక్ ‘వార్ 2’ కొత్త షెడ్యూల్‌లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లాడు. ఈ సందర్భంగా అతని కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో తారక్ మాస్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటోల్లో తారక్ గడ్డంతో మంచి రగ్గుడ్ లుక్‌లో కనిపించడం జరిగింది. దీనితో వార్ 2 సినిమాలో కూడా మామూలు మాస్ ట్రీట్ ఉండదు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా… వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల కాబోతుంది. ఇక ఎన్టీఆర్ నుంచి చాలా ఏళ్ల తర్వాత సోలోగా వచ్చిన భారీ చిత్రం దేవర ఏకంగా 500 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి అతని స్టార్ పవర్‌ని చూపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News