Sunday, January 19, 2025

మెక్సికోలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ!

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలిసింది. ఆగస్టులో సినిమా ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందని సమాచారం. ఈ సినిమా తొలి షెడ్యూల్ మెక్సికోలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. నీల్ రాసుకున్న కథకి అక్కడ బ్యాక్‌డ్రాప్ అయితే బాగుంటుందని తొలి షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశారట. ఇందులో పూర్తిగా యాక్షన్ సన్నివేశాలే చిత్రీకరించనున్నారని సమాచారం.

అలాగే మేజర్ పార్టు షూటింగ్ అంతా కూడా విదేశాల్లోనే ఉంటుందంటున్నారు. ఇక దాదాపు 15 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ ఉంటుందట. తారక్‌ని కొత్తగా చూపించడం కోసం ఏకంగా విదేశాల్లోనే మేజర్ పార్టు షూట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో తారక్‌కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాని ఎంపిక చేశారట. ఇప్పటికే ఈ భామ యానిమల్, పుష్ప సినిమాలతో పాన్ ఇండియాలో భారీగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎన్టీఆర్, రష్మిక జోడీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News