Tuesday, December 24, 2024

ఆస్కార్ 2023లో ‘ఉత్తమ నటుడు’ అవార్డుకు పోటీపడుతున్న జూ. ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్కార్ 2023లో ‘ఉత్తమ నటుడు’ అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్ పోటీపడుతున్నారని ఓ అమెరికా మ్యాగజైన్ రాసింది. అకాడమీ అవార్డుల నామినేషన్లను జనవరి 24న ప్రకటించనున్నారు. హాలీవుడ్ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్ పెను సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను ‘నాటునాటు..’ పాట గెలుచుకుంది. 95 అకాడమీ అవార్డుల నామినేషన్‌లను జనవరి 24న ప్రకటించనున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఇప్పుడు ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’తో పాటు వివిధ కేటగిరిల్లో కూడా పోటీపడబోతున్నదని అమెరికన్ మ్యాగజైన్ రాసింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ‘బెస్ట్ యాక్టర్’ అవార్డు కేటగిరిలో ముందంజలో ఉన్నారని వార్త. జూనియర్ ఎన్టీఆర్ నటనను అకాడమీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే నామినేషన్ బరిలో ఉన్నారు. ఆయనతో పాటు టామ్ క్రూయిజ్, పాల్ డానో, మియా గోత్, పాల్ మెస్కాల్, జో క్రావిట్జ్ పోటీపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ‘ఉత్తమ నటుడు’ అవార్డు దక్కితే అది తెలుగు వారికే కాదు, యావత్ భారత్‌కు కూడా గర్వకారణం కాగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.

రచయిత బ్రియాన్ ట్రూట్ ఇలా రాశారు: ‘అకాడమీలో సగం మంది ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆడియన్స్‌కు చాలా దగ్గరయింది. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు రామ్‌చరణ్ కూడా బ్రిటిష్ ఆర్మీ సోల్జర్‌గా బాగా నటించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పులితో పోరాటం, మోటార్‌సైకిల్‌పై ఫీట్లు…ఆకట్టుకునే సన్నివేశాలు ఎన్టీఆర్‌ను ముందంజలో ఉంచుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పాశ్చాత్య ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఆర్‌ఆర్‌ఆర్ అనేక అవార్డులు గెలవాలని ఆ సినిమా టీమ్ కూడా బిజీబిజీగా ఉందని వార్త.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News