Saturday, November 2, 2024

ఫ్యాన్సీ నెంబర్ కోసం రికార్డు వేలం పాడిన ఎన్టీఆర్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో మరోసారి నిరూపితమైంది. ఖైరతాబాద్ ఆర్టిఎ అధికారులు ఫ్యాన్సీ నెంబర్లకు బుధవారం వేలం పాట నిర్వహించారు. టిఎస్ 09 ఎఫ్‌ఎస్ 9999 నంబరును జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఈ నెంబర్ కోసం ఎన్టీఆర్ రూ.17 లక్షల భారీ వేలం పలికారు. ఇక ఎన్టీఆర్‌కు ఈ నెంబర్ అంటే ఎంత ఇష్టమో అభిమానులకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కొన్న కార్లకు ఎక్కువగా 9999 వచ్చేలా ఫ్యాన్సీ నెంబర్లు మీద ఆయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అత్యంత విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఈ మోడల్ కార్ ఆన్ రోడ్ ధర రూ.3.43 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. ఈ కారు కోసమే ఎన్టీఆర్ టిఎస్ 09 ఎఫ్‌ఎస్ 9999 నెంబర్ ను భారీ వేలంతో దక్కించుకున్నారు. గతంలో ఆయన పేరు మీదనే ఉన్న రికార్డును ఆయనే బ్రేక్ చేశారు.

ఇక ఎన్టీర్‌కు 9 అనే నెంబర్ ఇష్టమైన నెంబర్.. కారుతో పాటు ట్విటర్ ఖాతాలో కూడా ఎన్టీఆర్ @tarak9999 కనిపిస్తుంది. తన తాత సీనియర్ ఎన్టీఆర్ కారు నెంబర్ 9999 అని, తన తండ్రి హరికృష్ణ కూడా అదే వాడాడని, అందుకే తనకు ఆ నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. బుధవారం జరిగిన అన్ని ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఎన్టీఆర్‌దే హయ్యెస్టు బిడ్.. ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఆర్టిఎ అధికారులకు మొత్తం రూ.45,52,921 వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో రెండు ఫ్యాన్సీ నెంబర్లు గరిష్ట ధరకు అమ్ముడుపోయాయి.

వాటిని దక్కించుకున్న యజమాlనుల వివరాలు

నెంబర్ టిఎస్ 09 ఎఫ్‌టి 0001.. బిడ్ మొత్తం రూ.7,01,000 యజమాని పేరు లహరి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ టిఎస్ 09 ఎఫ్‌టి 0009 బిడ్ మొత్తం రూ.3,75,999.. యజమాని పేరు రతన్ నల్లా.

Jr NTR sets record in RTA bid auction for Fancy Number

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News