Saturday, April 5, 2025

అందుకే ‘అదుర్స్ 2’ చేయడం లేదు: జూ.ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

కామెడీ చేయడం కష్టమని.. కానీ, ఈ సినిమాలో కామెడీతో బాగా నవ్వించారని ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమాపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఫన్ ఎంటన్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ హిట్ కొట్టడంతో చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. నవ్వించడం ఓ వరమని.. మనకెన్ని బాధలు.. కష్టాలు ఉన్నా ఓ మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే వాటి నుంచి బయటపడిపోవాలని అందరికీ అనిపిస్తుంటుందన్నారు. అలా నవ్వించే మనుషులు అరుదుగా ఉంటారని.. విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమోనని అన్నారు. అమాయకత్వంతో కూడిన పాత్రను ఆయన అద్భుతంగా పోషించారని ప్రశంసించారు. ఒకప్పుడు తాను ఎలా ఉండేవాడినో ఇప్పుడు రామ్‌ నితిన్‌ అలాగే ఉన్నారని.. తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారన్నారు. అన్నింటికంటే కామెడీ చేయడం చాలా కష్టంమని.. ఆ విషయంలో తాను ఇప్పుడు భయపడుతున్నానన్నారు. అందుకే ‘అదుర్స్‌ 2’ చేయట్లేదని నవ్వుతూ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News