Sunday, December 22, 2024

ఏప్రిల్ నెలాఖరు నుంచి ‘వార్ 2’లో ఎన్టీఆర్

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. వార్ 2 సినిమాతో తారక్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తారు. ఇప్పటికే హృతిక్ రోషన్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా షూటింగ్‌కి టైమ్ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు తారక్‌ది చిన్న పాత్ర కాదు. హృతిక్ రోషన్‌కి సమానంగా ఉండే పాత్ర. అంటే ఫుల్ లెంగ్త్‌లో డేట్స్ ఇవ్వాలి. హృతిక్ రోషన్ ఈ సినిమాకి 100 రోజుల డేట్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ కూడా 60 నుంచి 80 రోజుల డేట్స్ ఇస్తారు. ఏప్రిల్ నెలాఖరులో ఎన్టీఆర్…

వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఆగస్టునాటికి మొత్తం వర్క్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తారక్ ‘దేవర 2’ మూవీ కానీ మరో సినిమా కానీ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ‘వార్ 2’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్… ఎన్టీఆర్ సరసన నటిస్తోంది అంటూ బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు వార్ 2 మూవీ కోసం జంటగా నటించబోతున్నారట. ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News