హైదరాబాద్: తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నిక గెలుపే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కానుందని భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు మునుగోడులో ప్రచారాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఆదివారం మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బిజెపి అన్ని ఏర్పాట్ల చేసింది. ఈ సభ కోసం మరికొద్ది గంటల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మునుగోడు సభ తర్వాత అమిత్ షా, ఎన్టీఆర్ లు హైదరాబాద్ లోని నోవాటెల్ లో భేటీ కానున్నట్లు సమాచారం. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ నటనను మెచ్చి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరి భేటీపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది.
Jr NTR to meet Amit Shah in Hyderabad