Monday, January 20, 2025

సీరియస్ లుక్‌లో ‘దేవర’

- Advertisement -
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌మేకర్స్ శుక్రవారం ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని శుక్రవారం రాత్రి చిత్రంtలోని తారక్ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేశారు.

సముద్రపు అంచున రక్తంతో ఉన్న కత్తిని పట్టుకొని రౌద్రంగా చూస్తున్న తారక్ లుక్ చూసి ప్రేక్షకులు, అభిమానులు మైమరచిపోతున్నారు. ఈ సీరియస్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రానికి నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News