Tuesday, December 24, 2024

ప్రియుణ్ని ఇరికించబోయి గంజాయి కేసులో ఇరుక్కున్న ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

ప్రియుడు తనను దూరం పెడుతున్నాడని ఆగ్రహించిన ఓ యువతి తెలివిగా అతన్ని గంజాయి కేసులో ఇరికించింది. అయితే విచారణలో ప్రియురాలి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అమెను కటకటాల వెనక్కి నెట్టారు.

హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఉంటున్న శ్రవణ్ కుమార్, ఎర్రగడ్డ సమీపంలోని రహ్మత్ నగర్ లో నివాసముండే రింకీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ఆఫీసులూ అమీర్ పేటలోనే ఉండటంతో తరచు కలుసుకునేవారు. అయితే కొంతకాలంగా శ్రవణ్.. రింకీని దూరం పెట్టసాగాడు. దాంతో కోపంతో రగిలిపోయిన రింకీ అతన్ని జైలుకు పంపేందుకు స్కెచ్ వేసింది.

మంగళ హాట్ లో కొంత గంజాయిని కొని, దాన్ని నాలుగు ప్యాకెట్లలో ప్యాక్ చేసి పెట్టుకుంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని పబ్ కు వెళ్దాం రమ్మంటూ శ్రవణ్ ని పిలిచింది. రింకీ, శ్రవణ్ తోపాటు మరికొందరు స్నేహితులు పబ్ కి వెళ్లారు. శ్రవణ్ కారులో పబ్ కి వచ్చాడు. శ్రవణ్ కి తెలియకుండా రింకీ అతని కారులో గంజాయి ప్యాకెట్లు దాచింది. పబ్ నుంచే పోలీసులకు ఫోన్ చేసి,  ఫలానా కారులో గంజాయి రవాణా అవుతోందంటూ చెప్పింది. పోలీసులు దాడి చేసి శ్రవణ్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు తనది కాదని, తన స్నేహితులదని శ్రవణ్ చెప్పడంతో కారులో వచ్చినవారందరినీ అదుపులో తీసుకుని విచారించారు. విచారణలో ఇదంతా రింకీ ప్లాన్ అని బయటపడింది. దాంతో రింకీని, ఆమెకు సహకరించిన ఆరుగురిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News