Monday, December 23, 2024

కొడంగల్ ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పిఎస్‌లో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై ఆదివారం కేసు నమోదైంది. ఉప్పరపల్లి స్థల వ్యవహారంలో ఎమ్మెల్యేపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, అతని అనుచరులు కొట్టారని ఇంద్రపాల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సామ ఇంద్రపాల్ రెడ్డి ఉప్పరపల్లిలో స్థలం కొనుగోలు చేశారు. ఉప్పరపల్లిలోని భూమికి సంబంధించి రూ. 3.65 కోట్లకు ఒప్పదం జరిగింది.

మధ్యవర్తిగా ఉన్న ఎమ్మెల్యేకు రూ. 3.05 లక్షలు ఇచ్చినట్లు ఇంద్రపాల్ రెడ్డి పేర్కొన్నాడు. నగదుతో పాటు 6 చెక్కులు ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. ఎమ్మెల్యేకు రూ. 60 లక్షలు ఉందని ఇంద్రపాల్ రెడ్డి చెప్పాడు. రూ. 2.5 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే , అనుచరులు కొట్టి, బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నాను. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News