Wednesday, January 22, 2025

హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు అయ్యింది. ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టి ధ్వంసం చేసినట్లు డిసిపి డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు డింపుల్ హయతితోపాటు ఆమె స్నేహితుడు డేవిడ్ పై కేసు నమోదు చేశారు.

జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్ క్లేవ్ లో ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే నివాసముంటున్నారు. అదే అపార్ట్ మెంట్ లో తన స్నేహితుడు డేవిడ్ తో కలిసి ఉంటున్న డింపుల్ హయతి.. సెలార్ లో పార్కింగ్ చేసి ఉన్న డిసిపి కారును ధ్వంసం చేసింది. డిసిపి డ్రైవర్ ఫిర్యాదుతో డింపుల్ హయతి, ఆమె స్నేహితుడు డేవిడ్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి సిఆర్ పిసి 41(ఎ) కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల మ్యాచో హీరో గోపిచంద్ నటించిన రామబాణం సినిమాలో డింపుల్ హయతి హీరోయన్ నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News