Friday, January 24, 2025

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ సీన్ రీకన్‌స్ట్రక్షన్…

- Advertisement -
- Advertisement -

Jubilee Hills rape reconstruction
హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్ బలాత్కార కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకనస్ట్రక్షన్ చేస్తున్నారు. అమ్నేషియా పబ్, కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్ రోడ్డు నం. 36,44 తదితర ప్రాంతాల్లో వారిని తిప్పుతున్నారు. ఘటన జరిగిన తీరును ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. సాదుద్దీన్ చెప్పిన వివరాల ఆధారంగా కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను కూడా ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు వారిని స్పాట్స్‌కు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా మళ్లీ వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News