Thursday, January 23, 2025

జూబ్లీహిల్స్‌లో మురుగునీటి సమస్యకు జలమండలి చర్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు, రోడ్ నం.92 పరిసర ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యను నివారించడానికి జలమండలి చర్యలు చేపట్టింది. శనివారం తాజ్ మహల్ హోటల్ దిగువన ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో నుంచి మురుగును డీజిల్ మోటార్ల ద్వారా సిబ్బంది తొలగిస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు కాలనీ నుంచి వయా తాజ్ మహల్ హోటల్ మీదుగా కట్ట మైసమ్మ వరకు ధ్వంసమైన పాత పైపు లైన్ పునరుద్ధరణ పనులు సైతం చేపట్టారు. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 ఏళ్ల క్రితం అప్పటి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 300 ఎంఎం డయా పైపు లైన్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అది పాక్షికంగా శిథిలమైంది. సెప్టిక్ ట్యాంకు వద్దనున్న పైపు లైన్ ఔట్ లెట్ ధ్వంసమైంది. దీంతో నీటి ఒత్తిడి పెరిగి మురుగు కేబీఆర్ పార్కులోకి వెళ్లడంతో పాటు రహదారి మీదనున్న మ్యాన్ హోళ్లు ఓవర్ ఫ్లో అయ్యేవి.

ఇక్కడి నుంచి ఫిర్యాదులు రావడంతో జలమండలి ఎండీ దానకిశోర్ గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించి తగిన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో వారు పనులు ప్రారంభించారు. తాజ్ మహల్ హోటల్ దిగువన ఉన్న సెప్టిక్ ట్యాంక్ ఔట్ లెట్ దగ్గర నుంచి మురుగును డీజిల్ మోటార్లతో తొలగించి కట్ట మైసమ్మ నుంచి లోటస్ పాండ్ వైపు వెళ్లే పైప్ లైన్ కు పంపింగ్ చేస్తున్నారు. ఇది ఖాళీ అయితే.. మురుగు నీరు కేబీఆర్ పార్కులోకి మురుగు చేర్డం ఆగిపోతుంది. దీంతోపాటు జర్నలిస్టు కాలనీ నుంచి కట్ట మైసమ్మ వరకు ధ్వంసమైన పాత పైపు లైన్ పునరుద్ధరణ పనులు సైతం చేపట్టారు. మ్యాన్ హోళ్ల మరమ్మతులు, ఇతరత్రా పనులు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News