Wednesday, January 8, 2025

జిల్లా జైలును సందర్శించిన జడ్జి చందన

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా జైలును శనివారం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి చందన సందర్శించారు. ఖైదిల వంట గది, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిసో తెలియక చేసిన చిన్న చిన్న దొంగతనాలకు జైలు జీవితం అనుభవిస్తున్న వాళ్లకు స్వేచ్చగా జీవించాలన్నారు. జైలులో మగ్గుతున్న చిన్న దొంగతనాలకు జైలు జీవితం అనుభవిస్తున్న సిద్దిపేట పోలీస్ స్టేషన్‌లో ఏడుగురు ఖైదీలను నేరం ఒప్పుకున్న కారణంగా వారికి జరిమాని విధించి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరిండెంట్ వికాస్, లీగల్ ఎయిడ్ డిపెన్స్ కౌన్సెల్స్ బాలయ్య, శ్రీకర్‌రెడ్డి, వెంకటేశ్, జిల్లా న్యాయ సేవాదికర సంస్థ సిబ్బంది శ్రీనివాస్, రాంరెడ్డి, ఆనంద్ , నిఖిల్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News