Monday, November 18, 2024

వివరణలు చూడకుండానే తీర్పా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్బాగమైన మేడిగడ్డ బ్యారేజీ పియర్ల పునరుధ్దరణకు సహకరించాలని రాష్ట్రప్రభుత్వం జాతీయ డ్యామ్‌సేఫ్టీ అథారిటీని కోరింది. డ్యామ్‌సేఫ్టీ అథారిటీ అందచేసిన నివేదికలో లేవనెత్తిన అంశాలపైనశనివారం రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా బదులిచ్చింది. నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి లో సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ నివేదిక రూపొంచింది డ్యామ్‌సేఫ్టీ అథారిటీకి అందజేసిం ది. అథారిటీ అడిగిన 20ప్రశ్నల్లో 11ప్రశ్నలకు ఇ దివరకే జవాబులు ఇచ్చామని తెలిపింది. వాటిని పరిగణలోకి తీసుకోకుండానే తుదినివేదిక అథారిటీ విడుదల చేసిందని బదులిచ్చింది.

నిపుణుల కమిటీ పరిశీలన జరిపి ఒక నిర్ణయం తీసుకుని అథారిటీకి వివరించేలోపే అథారిటీ తొందరపడి నివేదక విడుదల చేసిందని తెలిపింది. పియర్ కుంగిపోవడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న దశలో, రిపేర్లు చేసేందకు కాఫర్ డ్యాంను నిర్మిస్తున్న కీలకమైన సమయంలో అథారిటీ ఒక నిర్ణయానికి రావడం సబబుగా లేదని రాష్ట్రప్రభుత్వం  తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని తపోవన్‌ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర జలసంఘం అనుసరించిన ప్రోటోటైప్ విధానాన్ని ఇక్కడకూడా అనుసించామని తెలిపింది. బిఐఎస్ ప్రమాణాల ప్రకారమే ఆర్‌సిసి గైడ్‌వాల్స్ నిర్మాణాలు జరిగాయని తెలిపింది. ప్రాజెక్టును నిర్మిస్తున్న సమయంలో క్వాలిటీ కంట్రోల్ పరీక్షల్లో నాణ్యత లేదని అథారిటీ విమర్శలు చేయటం సబుబుగా లేదన్నారు. బ్యారేజీ నిర్మాణానికి రూపొందించిన డిజైన్లు ఐఎస్‌కోడ్ 6966 పార్ట్‌ వన్ (1989 సిబిఐపి )మాన్యువల్ ప్రకారం ఆర్‌సిసి నిర్మాణాలు జరిగాయని వెల్లడించింది. డ్రైనేజీ కోసం ఫ్రషర్ రిలీఫ్ వాల్వ్‌లను కూడా ఏర్పాటు చేశామని తెలిపింది. ఐఐటి హైదరాబాద్ సంస్థతో సంయుక్తంగా నమూనా క్వాలిటీ అధ్యయనాలు జరిపించినట్టు తెలిపింది. ఎస్‌ఎస్డీ నోటీసులో డిజైన్‌సమీక్షకు సంబంధించి అంశాలు పొందుపరిచామని తెలిపింది.వరుసగా కురిసిన వర్షాల కారణంగా డిజైన్లో ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించాలని నోటీసులో పెట్టామని తెలిపింది. కాని మార్పులు చేర్పులకు సంబంధించి ప్రభుత్వానికి ఏవిధమైన సూచనలు అందలేదని తెలిపింది.

కేంద్రజలసంఘం పరిధిలోని టెక్నికల్ అడ్వైజరి కమిటీకూడ 2018జూన్‌లో క్లియరెన్సులు ఇచ్చిందని తెలిపింది. డిపిఆర్‌కు, హైడ్రాలజి, వ్యయం ,ప్లానింగ్ , పర్యావరణ అనుమతులు వచ్చాయని తెలిపింది. ఆ తరువాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ దశలోనే సిడబ్యుసి చైర్మన్ మసూద్ హుస్సేన్‌తోపాటు ఇంజనీర్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నిర్మాణాలు పరిశీలించి గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం అని ప్రశంసించారని తెలిపింది. ఈ మొత్తం అంశాలను పరిశీలించి డ్యామ్ పునరుద్దరణ పనులకు సంపూర్ణంగా సహకరించాలని, అదికూడా పూర్తిగా ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ సూత్రాలకు లోబడి సహకరించాలని నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్ శనివారం డ్యామ్‌సేఫ్టీ అథారిటి చైర్మన్ సంజయ్ కుమార్ సిబాల్‌కు రాసిన పంపిన లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు డ్యామ్ సెఫ్టీ అథారిటీ నివేదికలోని పలు అంశాలను సమీక్షించేందకు రాష్ట నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించింది. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో ఈఎన్సీలు, డిజైన్స్ విభాగం అధికారులు, క్వాలిటీకంట్రోల్ విభాగం అధికారులు పాల్గొన్నారు. నివేదికలో ప్రస్తావించిన అన్ని అంశాలను సమగ్రంగా చర్చించారు. అంశాలవారీగా తగిన వివరాలతో డ్యామ్‌సేప్టి లేవనెత్తిన వాటికి ధీటనై జవాబు చెపుతూ నివేదికను సిద్దం చేసినట్టు సమాచారం . పరిశీలన నిమిత్తం ఈ నివేదికను ప్రభుత్వానికి అందేజేశారు. క్లియరెన్స్ రాగానే నివేదికను జాతీయ డ్యామ్‌సేప్టి అథారిటికి పంపనున్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి. రజత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్ ,నాగేందర్‌రావు, హరిరాం, వెంకటేశ్వర్లు, టెక్నికల్ కన్సల్టెంట్ రామరాజు ,సిఎం ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News