- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఎసిబి కోర్టు విచారణ నిర్వహించింది. శివ బాలకృష్ణను ఎసిబికి ఇచ్చిన 8 రోజులు కస్టడీ పూర్తయ్యిందని బెయిల్ మంజూరు చెయ్యాలని శివబాలకృష్ణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. శివ బాలకృష్ణకు బెయిల్ మంజూరు చెయ్యొద్దని ఎసిబి తరపు న్యాయవాది కోర్టును కోరారు.
ఇరు వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ప్రకటించనుంది. ఎసిబి విచారణలో శివ బాలకృష్ణ గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. శివబాలకృష్ణ వద్ద రూ.250 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు బినామీల పేర్లపై ఉన్నాయని అధికారులు గుర్తించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు.
- Advertisement -