- Advertisement -
న్యూఢిల్లీ: తెహెల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్‌తేజ్‌పాల్ కేసులో తీర్పును గోవాలోని సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. 2013లో గోవాలోని ఓ హోటల్‌లో తనపై తేజ్‌పాల్ లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం కోర్టులో 15 శాతం సిబ్బంది మాత్రమే పని చేస్తున్నారని, అందువల్ల తీర్పు ఆలస్యమైందని న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసులో తేజ్‌పాల్ ప్రస్తుతం బెయిల్‌పై బయటనే ఉన్నారు. ఆయనపై గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. తనపై అభియోగాలు నమోదు చేయకుండా తేజ్‌పాల్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది.
- Advertisement -