Thursday, December 19, 2024

యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్ గఢ్ విద్యుత్ పై న్యాయ విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖకు సంబంధించిన మూడు కీలక అంశాలపైన న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో టెండర్లు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒ ప్పందం, కాలం చెల్లిన సాంకేతికతతో నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలపైన న్యాయవిచారణ జరిపించనున్నట్టు వెల్లడించారు. గురువారం శాసనసభలో ప్రభుత్వం విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ అంశంపై చర్చలో భాగంగా విద్యుత్‌శాఖ మాజీ మంత్రి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి గత ప్రభుత్వంలో అవకతవలకు అక్రమాలు జరిగివుంటే సి ట్టింగ్ జడ్జిచేత న్యాయవిచారణ చేసుకోవచ్చని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. జ్యుడిషియరీ విచార ణ మంచి సూచన అని ఇలాంటివి ఇవ్వమని కోరుతున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ఆనాడే తా ము సభలో పోరాటం చేస్తే.. మార్షల్స్ తో తమ ను సభ నుంచి బయటకు పంపారని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందం పై ఓ అధికారి నిజాలు చెప్తే .. ఆ ఉద్యోగికి డిమోషన్ ఇచ్చి మారుమూల ప్రాంతాలకు పంపారన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల ఒ ప్పందం చేసుకున్నారన్నారని, ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వం పై రూ.1362 కోట్ల భారం పడిందని వెల్లడించారు .భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు.
కాలం చెల్లినా ఉపయోగించారు
సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లినా దాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి నష్టం చేశారు. భద్రాద్రి, యాదద్రి పవర్ ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేస్తామని ప్రకటించారు. 24 గంటల కరెంట్ పై అఖిల పక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేద్దాం అని వెల్లడించారు. శ్వేతపత్రంలో వాస్తవాలు వివరించామన్నారు.ప్రతిపక్షం తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేసిందని ఇటువంటి చర్యలు రాష్ట్రానికే నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. గత తొమ్మిదేళ్ల లో ప్రభుత్వ నిర్ణయాలు ఫలితాలు దుష్పలితాలు సభ ముందు పెట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ వి ధంగా ఏరోజు చేయలేదన్నారు. ఇది ప్రభుత్వానికి కూడా హెల్త్ చెకప్ లాంటిదన్నా రు. విద్యుత్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రజల సెంటిమెంటును గత ప్రభు త్వంఆర్దిక ప్రయోజనాలకు ఉపయోగించుకుందన్నారు. చత్తిస్‌గఢ్ తో తెలగాణ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం వల్ల లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసినా చేయకపోయినా ప్రభుత్వంపైన రూ.1362కోట్లు ఆర్ధిక భారం పెట్టారన్నారు. యాదాద్రి ధర్మల్ స్టేషన్ నిర్మాణంలో పనికిరాని పాత దుస్తులు, ఔట్‌డేటెడ్ సెల్‌పోన్‌లు తీ సుకున్నట్టు అప్పటికే కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజి వాడారన్నారు. కా లుష్యం లేని విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజిని వాడాలని ఆదేశించినా పట్టించుకోలేదన్నారు.

మెగావాట్ రూ. 6.75 కోట్లతో ఒక్కో యూని ట్ 270 మెగావాట్ల చొ ప్పున నాలుగు యూనిట్లు నిర్మాణం ఏడేళ్లయినా పూర్తి కాలేదన్నారు. దీని అంచాన మెగావాట్‌కు రూ. 9.74కోట్లకు పెంచారన్నారు. కేంద్ర సంస్థ కేటిపిపి ఏడవ దశ సూపర్ క్రిటికల్ టెక్నాలిజితో 48నెలల్లోనే నిర్మించిదని తెలిపారు. ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం అని చెప్పి యాదాద్రి పవర్‌ప్లాంట్ 24నెలల్లో పూర్తి అని చెప్పి ఓపెన్ టెండర్లు పిలవకుండా నామినేషన్ మీద ఒప్పందం కుదుర్చుకుందని ఇది నిబంధనలకు విరుద్దం అన్నారు. మెగావాట్ రూ6.25కోట్లకు ఒప్పదం కుదుర్చుకుని ఆ తర్వాత రూ.8.64కోట్లకు పెంచిందన్నారు. ఇంకా రూ.9కోట్లకు చేరుతుందన్నారు. ఇది ఇప్పుడు మొత్తం 34,543కోట్లకు చే రిందన్నారు.అదే సమయంలో ఎన్టీపిసి మెగావాట్ రూ.7.63కోట్ల ఖ ర్చుతోనే పూర్తి చేసిందన్నారు. వీటన్నింటిపైన సమగ్రంగా న్యాయ విచారణ జరిపిస్తామని సిఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News