Monday, December 23, 2024

యాదాద్రి ఆలయానికి జుగానో లైటింగ్స్

- Advertisement -
- Advertisement -

విద్యుత్ కాంతులు సౌండ్ సిస్టం, కెమెరా వైఫై నూతన టెక్నాలజీలతో లైటింగ్స్

లక్ష్మీనరసింహుడి దర్శనంలో కంపెనీ ప్రతినిధులు

మన తెలంగాణ/ యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నూతన టెక్నాలజీ లైటింగ్ వాడేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వైఫైతో విద్యుత్ కాంతులతో పాటు అందులోనే సౌండ్ సిస్టమ్, కెమెరాలు వచ్చే నూతన టెక్నాలజీని వాడేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఇజ్రాయిల్‌కు చెందిన జూగానో లైట్ పరిశ్రమ యజమాని అలెక్స్, ఇండియా హెడ్స్ కిరణ్, కీర్తిదేశాయ్‌లు ఆలయాన్ని సందర్శించారు.

ఎక్కడెక్కడ ఈ జుగానో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలనే అంశాలను పరిశీలించారు. ఇప్పటికే ఇండోర్ నుంచి తీసుకువచ్చిన పసిడి వర్ణం కాంతులు ఇప్పటికే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రాబోయే ఇజ్రాయిల్ కంపెనీ జుగానో విద్యుత్ దీపాలు టెక్నాలజీతో అందరిని ఆకట్టుకోనున్నాయి. రాయగిరి నుంచి ప్రధాన రహదారి, రింగ్‌రోడ్డు, ఘాట్‌రోడ్డు, యాదాద్రి ఆలయ పరిసరాల్లో ఈ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. 300 కెమెరాలు ప్రతి 150 మీటర్ల దూరంకు ఒకటి ఈ జుగానో విద్యుత్ దీపాలను బిగించనున్నారు. నెల రోజులలోపు ఈ విద్యుత్ దీపాల బింగిపునకు పూర్తికి సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారి రామారావు వెల్లడించారు.

వైఫై ద్వారా ఈ విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, సౌండ్ సిస్టమ్ ఉండే దీపాలను కొండపైనే ఉన్న కమాండో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కోన్నారు. ప్రస్తుతం ఈవో కార్యాలయం ముందు ఈ విద్యుత్ దీపాన్ని బిగించి ట్రయల్ రన్ చేసినట్లు తెలిపారు. జుగానో పరిశ్రమ యజమాని అలెక్స్‌తో పాటు ఇండియా హెడ్స్ కిరణ్, కీర్తి దేశాయ్‌లు ప్రధానాలయం, రింగ్‌రోడ్డు, ఘాట్ రోడ్డు, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించాలన్నారు. వీరి వెంట ఈసీఐఎల్ ప్రతినిధులు శాంతయ్య, వేణు, రవీందర్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News