Sunday, December 22, 2024

ఈ 5 రసాలు తాగితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..

- Advertisement -
- Advertisement -

మీ ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, ద్రవాలను చేర్చినట్లయితే..అది మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అవి మీ ఊపిరితిత్తులను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా..రోగనిరోధక శక్తి, శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. కాగా, ఇప్పుడు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచే రసాలు, ద్రవాలను గురుంచి తెలుసుకుందాం.

1. పసుపు పాలు

పసుపు పాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇది ఊపిరితిత్తులలో మంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. అందువల్ల ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

2. బీట్రూట్ రసం

బీట్‌రూట్ జ్యూస్‌లో విటమిన్ ఎ, సి, బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదనంగా, పొటాషియం, మెగ్నీషియం కూడా ఇందులో ఉంటాయి. కాగా, ఈ రసం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది.

3. ఆపిల్ రసం

ఉదయాన్నే ఆపిల్ జ్యూస్ తాగితే, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాపిల్‌లో ఉండే ఫైబర్ పొట్టను శుభ్రంగా ఉంచుతుంది.

4. ఆకుపచ్చ స్మూతీ

ఆకు కూరలు, పండ్లను కలిపి తయారు చేసే గ్రీన్ స్మూతీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, స్ట్రాబెర్రీలు, వేరుశెనగలను మిక్స్ చేసి ఈ స్మూతీని తయారు చేస్తే, ఇది మీ ఊపిరితిత్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

5. నిమ్మ, అల్లం టీ

అల్లంలో యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇదే సమయంలో నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News