Saturday, January 18, 2025

జుక్కల్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిన తోట లక్ష్మీకాంత్ రావు

- Advertisement -
- Advertisement -

నిజాంసాగర్: జుక్కల్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. గత మూడు పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హన్మంత్ షిండే ఈ సారి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. కౌంటింగ్‌లో రౌండ్ రౌండ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. చివరకు 1154 ఓట్ల మెజార్టీతో తోట లక్ష్మీకాంత్ రావు విజయం సాధించారు. ఎన్నికలు జరిగిన నుంచి ఎవ్వరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారనే ఊహానాగాలను నిజం చేస్తూ జుక్కల్‌కు కొత్త అభ్యర్థి విజయం సాధించారు. 15వ రౌండ్ వరకు స్వల్ప ఆధిక్యత కొనసాగిస్తూ వచ్చిన హన్మంత్ షిండే తర్వాత 4 రౌండ్‌లలో వెనుకబడటంతో చివరికు 1154 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అనంతరం తోట లక్ష్మీకాంత్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. సేవ చేసే భాగ్యం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News