పిట్లం: పిట్లం, బిచ్కుంద మండలాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని, నిజాంసాగర్, పెద్ద కొడప్‌గల్, డోంగ్లీలలో జూనియర్ కళాశాలలు, 11 తాండాలకు బీటి రోడ్లు మంజూరు, బ్రిడ్జిలకు నిధులు మంజూరు, రామలింగేశ్వరాలయంతో పాటు తదితర పలు రహదారులకు నిధులు, 8 లింకు రోడ్లు, పిట్లం, మద్నూర్ మండలాలకు డిగ్రీ కాలేజ్‌లు, పిట్లం, బిచ్కుంద మండలాలకు షాదీఖానాలు, పిట్లం, జుక్కల్‌లకు బంజారా భవన్‌లు, లెండికి 150 నుంచి 200 కోట్లు, మహ్మద్‌నగర్ నూతన మండలంగా ఏర్పాటు తదితర విషయాలను జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే మంత్రి కేటిఆర్ ముందుంచగా త్వరలోనే అన్నింటికి నిధులను మంజూరు చేసి, పిట్లం, బిచ్కుంద మున్సిపాలిటీలుగా చేయడంతో పాటు ఎమ్మెల్యే కోరిన కోరికలన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
రాబోయే ఎన్నికల్లో 72 వేల మెజార్టీతో ఎమ్మెల్యే హన్మంత్ షిండేను గెలిపించాలన్నారు. నిజాంసాగర్ మండలానికి దళితబంధు పథకం ద్వారా 1300 కుటుంబాలకు దళితబంధును అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, బిగాల గణేష్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, బీఆర్‌ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎఎంసీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.