Monday, December 23, 2024

జులన్ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

Julan Goswami takes 250 wickets

 

మౌంట్‌మాంగనూయి: మహిళల వన్డే క్రికెట్‌లో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డును సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జులన్ వన్డే కెరీర్‌లో 250 వికెట్ల మైలురాయిని అందుకుంది. ఈ క్రమంలో ఈ ఘనత సాధించి తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ ఒక్క బౌలర్ కూడా మహిళల క్రికెట్‌లో ఇలాంటి ఫీట్‌ను సాధించలేదు. అయితే గోస్వామి మాత్రం 199 వన్డేల్లో 250 వికెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్రిక్ (180), విండీస్ బౌలర్ అనిసా మహ్మద్ (180) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News