Monday, December 23, 2024

క్రికెట్‌కు జులన్ గుడ్‌బై?

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా సీనియర్ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసిందే. వచ్చే నెల ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ తర్వాత జులన్ క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్టు తెలిసిందే. 39 ఏళ్ల గోస్వామి దాదాపు రెండు దశాబ్దాలుగా టీమిండియా కీలక ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగుతోంది. పలు మ్యాచుల్లో భారత్‌కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టింది. మిథాలీరాజ్ తర్వాత భారత్‌లో అంతటి పేరున్న మహిళా క్రికెటర్ గోస్వామి మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఏడాది మార్చిలో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ తర్వాత గోస్వామి టీమిండియాకు దూరంగా ఉంది. కానీ ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు జులన్‌కు జట్టులో చోటు లభించింది. ఈ సిరీస్ తర్వాత జులన్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

Julan Goswamy Set to Retires from International Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News