Monday, December 23, 2024

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

Juluri Gowri Shankar elected as president of Hyderabad Book Fair

హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ తిరిగి ఎన్నికయ్యారు. శనివారం నాడు ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుక్ ఫెయిర్ సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో 2022-23 సంవత్సరానికి గాను ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక కావడం ఇది నాలుగోసారి. ఉపాధ్యక్షులుగా కోయ చంద్రమోహన్, పి నారాయణ రెడ్డి, కార్యదర్శిగా శృతికాంత్ భారతి, సహాయ కార్యదర్శిగా శోభన్ బాబు, కోశాధికారిగా పి రాజేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కవి యాకూబ్, ఎన్ మధుకర్, బి నర్సింగ్ రావు, ఏ జనార్దన్ గుప్తా, విజయరావు, కె బాల్ రెడ్డి, ఆర్. శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. మాటూరి సూర్యనారాయణ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News