- Advertisement -
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల గొంతుకైనా దాసోజు శ్రవణ్ ను గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిగా ఎంపిక చేసినందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 75 ఏళ్ల మండలి చరిత్రలో ఇద్దరు విశ్వకర్మలకు ఎంఎల్‌సిగా స్థానాన్ని కల్పించడం ఒక్క కెసిఆర్ మాత్రమే చేయగలిగారని తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్ లోని దాసోజు శ్రవణ్ కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలా చారి విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన్ ట్రస్ట్ కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్ విశ్వవిశ్వాని విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ ఆచారి తదితరులు దాసోజును ఘనంగా సన్మానించారు.
- Advertisement -