- Advertisement -
అమెరికాలో 70 శాతం టీకాలు
వాషింగ్టన్ : అమెరికాలో కరోనాపై పోరును పౌరులకు టీకాల పంపిణీతో అరికట్టే దిశలో బైడెన్ అధికార యంత్రాంగం చర్యలు తీసుకొంటోంది. దేశంలోని అడల్ట్ అమెరికన్లలో 70 శాతానికి పైగా వ్యాక్సినేషన్ల లక్షం ఉన్నట్లు, దీనిని జులై 4వ తేదీ వరకూ పూర్తి చేయనున్నట్లు జో బైడెన్ తెలిపారు. వచ్చే రెండు నెలల కాలంలో దేశంలోని కుటుంబాలన్ని కూడా కరోనా నియంత్రణ దిశలో సంబరాలు జరుపుకుని తీరుతాయని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జులై 4వ తేదీని అత్యధిక జనులకు వ్యాక్సినేషన్ల టార్గెట్ తేదీగా పెట్టుకున్నట్లు , అప్పటికి వయోజనులలో కనీసం 70 శాతం వరకూ టీకాలు పొందితీరుతారని వెల్లడించారు. ఈ దశలోనే 160 మిలియన్ల మంది అమెరికన్లకు టీకాల పంపిణీ జరుగుతుందని, ఈ స్థాయిలో జనం కనీసం ఒక్కడోస్‌ను అయినా అందుకుంటారని వివరించారు.
- Advertisement -