Monday, April 21, 2025

శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూలై నెల కోటా విడుదల

- Advertisement -
- Advertisement -

తిరుమ‌ల‌: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల‌ కోటాను ఏప్రిల్‌ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేష‌న్‌ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు.. ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు డబ్బులు చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జూలై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు

జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

23న శ్రీ‌వాణి టికెట్ల ఆన్ లైన్ కోటా

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News