- Advertisement -
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా జులై నెలలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమెరికాకు చెందిన నేషనల్ ఓసియోనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడించింది. గత 142 ఏళ్లలో జులైలో ఈ ఏడాదే అత్యంత వేడి దినాలుగా నమోదైనట్టు పరిశోధకులు చెప్పారు. భూమి, సముద్ర ఉపరితలంపై జులై నెలలో ఉష్ణోగ్రతల సగటు 0.93 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్టు అంచనా వేశారు. 2016 జులైలో రికార్డు అయిన ఉష్ణోగ్రతల కన్నా 2021 జులైలో 0.02 డిగ్రీ ఫారన్ హీట్ అధిక ఉష్ణోగ్రత నమోదయింది.
July with record-breaking temperatures
- Advertisement -