Monday, December 23, 2024

జమాత్‌-ఉల్‌-విదా: ట్రాఫిక్ ఆంక్షలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లింల పర్వదినం జమాత్‌-ఉల్‌-విదా(రంజాన్ నెలలో చివరి శుక్రవారం) రోజు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌లోని మక్కా మస్జిద్ వద్ద, సికింద్రాబాద్‌లోని జమా-ఇ-మస్జిద్ వద్ద శుక్రవారం ఆంక్షలు విధించారు. జమాత్‌-ఉల్‌-విదా సందర్భంగా నగరం నుంచే కాక జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నమాజీలు ప్రార్థనలు చేయనున్నారు. చార్మినార్ వద్ద మస్జిద్ వెలుపల రోడ్లపైన కూడా నమాజు చేసుకోడానికి ఏర్పాట్లు చేశారు. కాగా మక్కా మస్జీదు వద్ద మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ జనులను ఉద్దేశించిన ప్రసంగించనున్నారు. ప్రతి సంవత్సరం జమాత్‌-ఉల్-విదా ప్రార్థనల అనంతరం జల్సా యౌమ్‌-ఉల్‌-ఖుర్‌ఆన్ నిర్వహించుకోడానికి వారికి అనుమతి ఉంది. షాలిబండ వద్ద అన్ని రకాల వాహనాల రాకపోకలు ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు బంద్ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News