Sunday, September 8, 2024

‘రాజ్యాంగ హత్యా దినోత్సవం?’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం జూన్ 25వ తేదిని ‘రాజ్యాంగ హత్యా దినోత్సవం’(సంవిధాన్ హత్యా దివస్) గా ప్రకటించింది. 1975 లో ఆ తేదీన ‘ఎమర్జెన్సీ ప్రకటించి’ అమానవీయ యాతనకు గురిచేసిందని పేర్కొంది.

“ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన నియంతృత్వ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ జూన్ 25, 1975న ఎమర్జెన్సీని విధించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం ఆత్మను తొక్కేశారు. కారణం లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టి మీడియా నోరు మూయించారు. జూన్ 25ని ‘సంవిధాన్ హత్యా దివస్‌’గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజును 1975 ఎమర్జెన్సీ సమయంలో అమానవీయ బాధను అనుభవించిన వారందరి త్యాగానికి అంకితం చేయబడుతుంది ”అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ‘ఎక్స్’ పోస్ట్ లో వెల్లడించారు.

ఇందిరా గాంధీ బాహ్య , అంతర్గత బెదిరింపులను పేర్కొంటూ 21 నెలల ఎమర్జెన్సీని విధించారు, అయితే ప్రాథమిక స్వేచ్ఛను నిలుపుదల చేశారు, మీడియాను నిశ్శబ్దం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పలువురు అగ్ర రాజకీయ నాయకులు – బిజెపి దిగ్గజాలు ఎబి వాజ్‌పేయి , ఎల్‌కె అద్వానీ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ములాయం సింగ్ యాదవ్, జనతా పార్టీకి చెందిన జెపి. నారాయణ్ సహా చాలా మంది నిర్బంధించబడిన వారిలో ఉన్నారు. నాడు కాంగ్రెస్ అసమ్మతివాదులను కూడా కటకటాల వెనక్కి నెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News